Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-05-2021 శనివారం దినఫలాలు - వేంకటేశ్వరుని ఆరాధించినా...

Webdunia
శనివారం, 1 మే 2021 (04:01 IST)
మేషం : స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆదరణ లభిస్తుంది. కార్యసాధనలో శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలు తప్పవు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండండి. దైవ, సేవా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివస్తుంది. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఆడిటర్లకు, పురోభివృద్ధికి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మిథునం : ప్రైవేటు సంస్థలలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడుట మంచిది. హామీలకు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు కొత్త పరిచయాలు వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. 
 
సింహం : భాగస్వామికులతో చర్చలు అనుకూలిస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రిప్రజెంటేటివ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. స్త్రీలకు చుట్టుపక్కలవారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కన్య : కుటుంబీకులతో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. విలువైన వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. సిమెంట్ స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలుకాగలదు. 
 
తుల : కుటుంబంలో శుభకార్యాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. పుణ్యక్షేత్రాల సందర్శిస్తారు. 
 
వృశ్చికం : స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రాజకీయాలలో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారు అని గమనించండి. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనాలు, పుస్తక పఠనం వైపు ఆసక్తి చూపుతారు. కాంట్రాక్టర్లకు నాణ్యతాలోప నిర్మాణాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
ధనస్సు : వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్ళకు తావివ్వకండి. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కొన్ని అవకాశాలు ప్రయత్నపూర్వకంగాను, యాదృచ్ఛికంగాను కలిసివస్తాయి. ఫిక్స్‌డ్, డిపాజిట్లు, ఎల్ఐసి పాలసీలకు సంబంధించిన ధనం చేతికందుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. 
 
మకరం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి అనునయంగా వివరించడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవారేగానీ, సహాయం చేసే వారే ఉండరు. వ్యాపారాల్లో ఆటంకాలు, నష్టాలు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. 
 
కుంభం : విదేశీ చదువుల కోసం ముమ్మరంగా యత్నాలు సాగిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మిమ్మల్ని ప్రేమించేవారిని అశ్రద్ధ చేయడం మానండి. ముఖ్యంగా, ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. 
 
మీనం : కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్త్రీలు షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. బంధు వర్గాల నుంచి సహాయ సహకారాలు అందుకుంటాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అధిక పనిభారం వల్ల చికాకులను ఎదుర్కొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

తర్వాతి కథనం
Show comments