22-11-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు-మహాలక్ష్మిని ఎర్రని పూలతో పూజించినట్లైతే?

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (07:00 IST)
శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎర్రని పూలతో పూజించినట్లైతే, శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: ఆర్థిక సంస్థల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. దైవదీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మిమ్ములను ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం వుంది. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఉద్యోగస్తులు అధికారులకు విలువైన కానుకలందిస్తారు. 
 
వృషభం: విత్తనాలు, మందులు, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మిథునం: తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక మీ ఉన్నతికి తోడ్పడుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లో వారికి పనిభారం, ఒత్తిడి తప్పవు. క్రయ విక్రయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. సోదరులతో ఆస్తి విషయాలు ప్రస్తావిస్తారు.
 
కర్కాటకం: పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. బ్యాంకు వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు వుండదు. గత అనుభవంతో వర్తమానంలో ఒక సమస్యను అధిగమిస్తారు. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
సింహం: వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. వాణిజ్య ఒప్పందాలు, లీజు ఏజెన్సీల వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తాయి. గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభమవుతాయి.
 
కన్య: స్త్రీలకు కుటుంబంలోను, చుట్టుపక్కల వారిలోను ఆదరణ లభిస్తుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
తుల: ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవ వుండదు. పొదుపు చేయాలనే మీ యత్నం ఏమాత్రం సాధ్యం కాదు. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో అవకాశం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ప్రతికూలతలు ఎదురవుతాయి.
 
వృశ్చికం: బంధువుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టిసారిస్తారు. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. మీ సంతానం ఉన్నత చదువుల కోసం ప్రయాణం చేయవలసివస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.
 
ధనస్సు: వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా వుండదు. దైవ  కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ధన వ్యయం విపరీతంగా వున్నా సార్థకత వుంటుంది. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం వుంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం.
 
మకరం: కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చికు వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా లభించినట్లైతే ప్రతిఫలం సంతృప్తికరంగా వుండదు. ప్రేమికులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనర్ధాలకు దారితీస్తుంది. 
 
కుంభం: వ్యవసాయ, తోటల రంగాల వారికి చికాకులు తప్పవు. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవడం మంచిది. 
 
మీనం: కుటుంబీకులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. విద్యార్థులకు తోటివారి కారణంగా మాటపడక తప్పదు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

లేటెస్ట్

Karthigai Deepam: అరుణాచలేశ్వరం.. కార్తీక దీపం ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం..

01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments