Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-11-2019 గురువారం మీ రాశి ఫలితాలు-దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు

Advertiesment
Daily Horoscope
, గురువారం, 21 నవంబరు 2019 (07:41 IST)
ఈ రోజున 12 రాశుల వారు ఇష్ట దైవాన్ని ఆరాధించినట్లైతే మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
మేషం: దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
వృషభం: విద్యార్థులకు క్రీడా రంగాల్లో వారికి ఆసక్తి పెరుగుతుంది. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయడం శ్రేయస్కరం. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం.
 
మిథునం: దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. 
 
కర్కాటకం: వస్త్ర, బంగారం, ఎలక్ట్రానికల్ వస్తు వ్యాపారాలకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఎల్ఐసీ పోస్ట్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆశాజనకంగా ఉంటుంది.
 
 
సింహం: స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి మెళకువ అవసరం. మీ కోసం, మీ కుటుంబీకుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. వాహనం ఏకాగ్రత నడపవలసి ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందించడం వల్ల మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
కన్య: కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునః ప్రారంభం కాగలవు. కుటుంబీకుల మధ్య నూతన విషయాలు చర్చకు రాగలవు. మత్స్య, కోళ్ల, గొర్రెల వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
తుల: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఏ ప్రయత్నం కలిసిరాకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. సోదరీ సోదరులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
వృశ్చికం: ఆర్థికలావాదేవీలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత, పునరాలోచన ఎంతో ముఖ్యం. తలపెట్టిన పనిలో ఆటంకాలు వంటివి ఎదుర్కొంటారు. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి పనిభారం అధికమవుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
ధనస్సు: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. విద్యార్థులు చంచల స్వభావం విడనాడి కృషిచేసినట్లైతే సఫలీకృతులవుతారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. తలపెట్టిన పనులు అర్థాంతరంగా వాయిదా పడతాయి. హామీలకు, వాదోపవాదాలకు దూరంగా వుండటం మంచిదని గమనించండి. 
 
మకరం: ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాయిదా పడిన బ్యాంకు పనులు పునః ప్రారంభిస్తారు. మీ జీవిత భాగస్వామి ప్రోద్భలంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం: స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తు పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునః ప్రారంభం అవుతాయి. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం వుంది. 
 
మీనం: వస్త్ర, బంగారు, వెండి, లోహ, స్టేషనరీ వ్యాపారాలు లాభసాటిగా వుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతారని గమనించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం, నిద్ర లేవగానే ఎవరిని చూస్తారు?