Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-11-2019 ఆదివారం మీ రాశి ఫలితాలు..సూర్య నారాయణ పారాయణ చేసినట్లైతే?

Advertiesment
17-11-2019 ఆదివారం మీ రాశి ఫలితాలు..సూర్య నారాయణ పారాయణ చేసినట్లైతే?
, ఆదివారం, 17 నవంబరు 2019 (07:00 IST)
సూర్య నారాయణ పారాయణ చేసినట్లైతే అన్ని విధాలా శుభదాయకం 


మేషం : కుటుంబీకులతో కలిసి విందువినోదాలతో పాల్గొంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి కాగలవు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయుల నడుమ కానుకలిచ్చిపుచ్చుకుంటారు. 
 
వృషభం: ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు పనిభారం అధికం అవుతుంది. ప్రయాణాల్లో వస్తువులు పోయే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
మిథునం: వన సమారాధనలు, వేడుకల్లో అందరితో కలిసి ఉల్లాసంగా గడుపుతారు, దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంత ధనం వెచ్చించినా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా వుండదు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కర్కాటకం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. అనవసర ఖర్చులు పెరగడంతో ఒకింత ఆందోళన చెందుతారు. 
 
సింహం: ఉపాధ్యాయులకు, మార్కెంటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ కదలికలపై నిఘా వుందనే విషయాన్ని గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత, మెళకువ అవసరం. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
కన్య: శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. విందులలో పరిమితి పాటించండి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురయ్యే సూచనలున్నాయి.  
 
తుల: మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగులు సభ, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యక్రమాలు మీ చేతుల మీదుగానే సాగుతాయి. 
 
వృశ్చికం: బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణల లక్ష్యం నెరవేరుతుంది. స్త్రీల ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ప్రోత్సాహం లభిస్తాయి. శకునాల కారణంగా మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు వంటివి ఎదుర్కొంటారు.
 
మకరం: విదేశీ ప్రయాణాలకై చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులౌతారు. నిరుద్యోగులలో నిరుత్సాహం, నిర్లిప్తత అధికమవుతాయి. బంధువుల రాకవల్ల గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయాల్లో వారికి ఆదరాభిమానాలు అధికం అవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కుంభం: రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండ. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు కృషి ఫలిస్తుంది. 
 
మీనం: వనసమారాధనలో బంధుమిత్రులతో కలయిక సంతోషాన్నిస్తుంది. మీ కళత్ర మొండితనం చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరికాయ చెట్టు వున్నట్లైతే?