Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుధవారం (13-11-2019) దినఫలాలు - స్త్రీలకు పనివారితో...

Advertiesment
బుధవారం (13-11-2019) దినఫలాలు - స్త్రీలకు పనివారితో...
, బుధవారం, 13 నవంబరు 2019 (09:05 IST)
మేషం : వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. నూతన దంపతులు ఒకరినొకరు మరింత చేరువ అవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. సహకార సంస్థలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. 
 
వృషభం : విద్యార్థులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమువుతాయి. సొంతంగా వ్యపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. నిశ్చింతగా ఉండండి. మీ సమస్యలు ఇబ్బందులు ఇవే సర్దుకుంటాయి. 
 
మిథునం : దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. మీ సోదరుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. భాగస్వామిక వ్యాపారస్తులకు పరస్పర అవగాహన కుదరకపోవచ్చు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పురోభవృద్ధి. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులు లబ్దిపొందుతారు. 
 
కర్కాటకం : గృహంలో సమస్యలు తలెత్తుతాయి. రాజకీయనాయకులకు చికాకులు అధికమవుతాయి. కుటుంబీకుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కొంటారు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
సింహం : మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు తమ ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కన్య : కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తికానరాదు. మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని గమనించండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
తుల : ఏదైనా విలువైనా స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ప్రముఖులకు విలువైన కానుకలు ఇచ్చి వారిని ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. 
 
వృశ్చికం : ఉద్యోగ, వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వడం వల్ల మాటపడక  తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. బంధువులను కలుసుకుంటారు. 
 
ధనస్సు : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలం. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. డాక్టర్లు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
మకరం : స్త్రీలకు కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల హోదా, పెరగటం, ప్రత్యేక ఇంక్రిమెంట్లు వంటి శుభాఫలితాలుంటాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. వ్యాపారాభివృద్ధికే చేయు కృషిలో పోటీ వాతావరణం అధికం కావటంతో ఆందోళన చెందుతారు. 
 
కుంభం : చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. స్త్రీల ఆలోచనలు నిలకడగా ఉండవు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం లోపిస్తుంది. మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మీనం : ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసహం. ధనం, అధికంగా వ్యయం చేస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రిస్తున్న స్త్రీతో శృంగారం, పురాణాల్లో ఏం చెప్పబడింది?