Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-11-2019 శనివారం మీ రాశి ఫలితాలు

Advertiesment
09-11-2019 శనివారం మీ రాశి ఫలితాలు
, శనివారం, 9 నవంబరు 2019 (06:03 IST)
శనివారం పూట పంచముఖ ఆంజనేయస్వామిని తమలపాకులతో ఆరాధించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
మేషం: కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. వేడుకలు, శుభకార్యాలు ఆడంబరంగా జరుపుతారు. నూతన దంపతులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అధికారుల తీరును గమనించి మెలగండి. ఫిర్యాదులు, కేసులు వెనక్కి తీసుకుంటారు. 
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ట్రాన్స్ పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. 
 
మిథునం: ముక్కుసూటిగా పోయే మీ తత్వం వివాదాలకు దారితీస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ ఆధిపత్యం అన్ని చోట్ల పనిచేయదని గమనించండి. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కర్కాటకం: నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. ఒక శుభకార్యాన్ని ఆడంబరంగా నిర్వహిస్తారు. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపన వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. 
 
సింహం: ఆర్థికలావాదేవీలు, నగదు చెల్లింపులు, హామీల విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించండి. మీ గౌరవాభిమానాలకు భంగం వాటిల్లే సూచనలున్నాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కన్య: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. తొందరపాటు తనానికి చింతించవలసి వుంటుంది. రిప్రజెంటివ్‌లకు, ఉపాధ్యాయులకు సదవకాశాలు లభించగలవు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ, కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు సంభవం.
 
తుల: సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవడం మంచిది కాదు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. స్త్రీలు తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. పత్రిక, వార్తా సిబ్బంది పనిభారం, విశ్రాంతి లోపం తప్పవు.
 
వృశ్చికం: బ్యాంకు పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. సిమెంట్, ఐరన్, కలప వ్యాపారస్తులకు శుభం. వనసమారాధనలు, వేడుకల్లో పాల్గొంటారుయ బంధుమిత్రులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తుకుండా వ్యవహించండి. శ్రద్ధ వహించండి. 
 
ధనస్సు: దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. నూతన వ్యక్తులతో అప్రమత్తంగా వ్యవహరించండి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఎదుటివారి ఆలోచనలను గ్రహించి ఎత్తుక పై ఎత్తు వేసి జయం పొందుతారు.
 
మకరం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉత్తర ప్రత్యుత్తరాలతో సంతృప్తిగా సాగుతాయి. రుణ చెల్లింపులు, ఇతర అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్త్రీలు శుభకార్యాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కుంభం: రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థుల్లో వేదాంత ధోరణి కానరాగలదు. పెద్దలకు వస్త్రదానం చేసి ఆశీస్సులు అందుకుంటారు. షాపుల అలంకరణ, సేల్స్ సిబ్బంది చురుకుతనంతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. అనుకోకుండా కలిసిన ఒక వ్యక్తికి అధిక ప్రాధాన్యతనను ఇస్తారు. 
 
మీనం: మీ అవసరాలకు కావలసిన ధనం ఆత్మీయుల ద్వారా సర్దుబాటు కాగలదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో ఏకాగ్రత అవసరం. శాస్త్ర, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల కపిలేశ్వర స్వామికి 12న ఘనంగా అన్నాభిషేకం