Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళవారం (05-11-2019) దినఫలాలు

webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (08:37 IST)
మేషం: హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. తలపెట్టిన పనుల్లో జాప్యం వల్ల నిరుత్సాహం తప్పదు. ప్రియతముల రాక మీకు సంతోషాన్నిస్తుంది. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి వుంటుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.
 
వృషభం: స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కీలకమైన వ్యవహారాల్లో భాగస్వామ్యుల నుంచి వ్యతిరేకత, పట్టింపులు ఎదురవుతాయి. పీచు, నార, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది.
 
మిథునం: ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వుంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం. చికాకులు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. తల్లితండ్రులతో ఏకీభవించలేకపోతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
కర్కాటకం: గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం ద్వారా ఎందులోనూ ఏకాగ్రత వహించలేరు. స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా వుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల నుంచి కావలసిన సమాచారం రాబట్టుకుంటారు.
 
సింహం: బ్యాంకు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. తరచూ దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం సిద్ధిస్తుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరుల గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి.
 
కన్య: ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. రచయితలకు పత్రికా రంగంలోని వారికి కలిసిరాగలదు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. రాజకీయాల్లో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
తుల : ఆర్థికంగా మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ఉద్యోగులు పై అధికారుల నుంచి ఒత్తిడి మొహమ్మాటాలు ఎదుర్కొవలసివస్తుంది. ప్రైవేట్, పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోగతి కానరాగలదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
ధనస్సు: శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు మెళకువ అవసరం. దంపతుల మధ్య అవగాహనలోపం వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీ సోదరుల మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మకరం: బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో అనుభవజ్ఞుల సలహా అడగటం మంచిది. దైవదీక్ష స్వీకరించడంతో మీలో కొంత మార్పు వస్తుంది. దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించదు. ముఖ్యులలో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
కుంభం: ఆర్థిక విషయాలలో గోప్యంగా వ్యవహరించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలు దూరంగా వుండటం మంచిది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సంఘంలో మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. సన్నిహితులతో మీ కష్టాలు చెప్పుకోవడం వల్ల మానసికంగా కుదుటపడతారు.
 
మీనం: స్త్రీల ఆత్మనిగ్రహానికి పరీక్షా సమయమని  చెప్పవచ్చు. వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్పెక్యులేషన్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. సోదరి, సోదరుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

5-11-2019 మంగళవారం మీ రాశి ఫలితాలు