Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-11-2019 బుధవారం మీ రాశి ఫలితాలు

webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (07:00 IST)
వైద్యనాధుని ఎర్రని పువ్వులతో పూజించినట్లైతే మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
మేషం: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి మంచి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయ. ప్రైవేట్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికం అవుతుంది. విద్యార్థులకు మంచి మంచి ఆలోచలు స్ఫురించగలవు. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం: విద్యార్థినులు నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. బ్యాంకింగ్ రంగాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ధ్యేయం కార్యరూపం దాల్చుతుంది. స్త్రీల ఆత్మనిగ్రహానికి ఇది పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మిథునం: స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా నిర్వహిస్తారు. అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి.
 
కర్కాటకం: కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. రాజకీయాల్లో వారు సంక్షోభాన్ని ఎదుర్కుంటారు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. మెళకువ వహించండి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వాయిదా పడతాయి. 
 
సింహం: కాంట్రాక్టర్లకు పనిమీద ధ్యాస తగ్గడం వల్ల సమస్యలు తప్పవు. స్త్రీల ప్రతిభ, అర్హతలకు సంబంధించిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవాల్సి వుంటుంది.
 
కన్య: చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. సోదరీ, సోదరుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కొంటారు. 
 
తుల: ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభించగలదు. ట్రాన్స్ పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఓర్పు, మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. స్త్రీలకు అయినవారితో పట్టింపులు ఎదురవుతాయి. రాజకీయాలు, కళ, సాంస్కృతిక, ప్రకటనల రంగాల వారు లక్ష్యాలు సాధించడం కష్టం.  
 
వృశ్చికం: విదేశాలకు వెళ్లే యత్నాలు ఫలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు సానుకూలమవుతాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 
ధనస్సు: ఏదైనా స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయడం మంచిది. పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్య రీత్యా అధికంగా ధన వ్యయం చేస్తారు. ఉపాధ్యాయులకు, రిప్రజెంటివ్‌లకు, ఏజెంట్లకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మకరం: కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు శుభదాయకం. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఒక శుభకార్యానికి హాజరు కాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలు వనసమారాధనలో పాల్గొంటారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనబడుతుంది. రుణప్రయత్నం వాయిదా పడతుంది. 
 
కుంభం: కొత్తగా వ్యాపారం చేయాలని ఉంటే వాయిదా వేయకండి. పాత మిత్రుల కలయికతో మీలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కనుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత పొందుతారు. మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీయవచ్చు. 
 
మీనం: ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగిపోతాయి, దైవ కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్థిరాస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నంలో పునరాలోచన మంచిది. బంధువులు ఒక వ్యవహారంలో మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తారు. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

కమనీయం.. తిరుమల శ్రీవారి పుష్పయాగం