Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-11-2019 సోమవారం మీ రాశి ఫలితాలు

Advertiesment
11-11-2019 సోమవారం మీ రాశి ఫలితాలు
, సోమవారం, 11 నవంబరు 2019 (10:31 IST)
మేషం: బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్త్రీలు ప్రతి విషయంలో అతిగా వ్యవహరించడం మంచిదికాదని గ్రహించండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుగుణంగానే ఉంటాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
వృషభం: వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. ఆరోగ్యం, ఆహార విషయాలపై శ్రద్ధచూపిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ విరోధులు కూడా మీ సహాయం అర్థిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు.'''
 
మిధునం: హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత విధ్య విదేశీ వ్యవహారాలకు ఆటంకం కలుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు. స్త్రీలకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త పరిచయాలు లభిస్తాయి.
 
కర్కాటకం: స్త్రీలను ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అందరితో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములరావచ్చు. జాగ్రత్త వహించండి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రాబడికి మించిన ఖర్చులు వల్ల ఆటు, పోట్లు తప్పవు.
 
సింహం: కోర్టు వ్యవహారాలు, ఆస్తితగాదాలు పరిష్కారమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. బ్యాంకు లావాదేవీలు, రుణప్రయత్నాలు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి.
 
కన్య: మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. క్రయ విక్రయాలలో నాణ్యత గమనించండి. అనుకున్న పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది.
 
తుల: ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. కొంత మంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృశ్చికం: శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పెద్ద హొదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. కుటుంబ పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయోగాలకు తగిన సమయం కాదు.
 
ధనస్సు: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది.
 
మకరం: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం వేచి యుండకతప్పదు.
 
కుంభం: బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. విద్యార్థులు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. ఇతరుల కుటుంబ విషయంలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. వాహన యోగం పొందుతారు. స్త్రీలు ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు.
 
మీనం: పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. బ్యాంకు పనులు ఆశించినంత చురుకుగా సాగవు. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. మిత్రులు మీ నుండి ధన సహాయం కోరవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకో తెలుసా?