Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుక్రవారం (15-11-2019) రాశిఫలాలు - దంపతుల మధ్య సఖ్యత...

శుక్రవారం (15-11-2019) రాశిఫలాలు - దంపతుల మధ్య సఖ్యత...
, శుక్రవారం, 15 నవంబరు 2019 (09:22 IST)
మేషం : ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. సంఘంలో పెద్ద మనుషులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతరం శ్రమించాలి. క్రీడ, కళ, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం : గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ప్రతి విషయంలోనూ తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. వృత్తిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
మిథునం : వనసమారాధనలు, దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే సఫలీకృతులవుతారు. స్త్రీలకు నరాలు, రుతు సంబంధిత చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనంగా బాగా వెచ్చించాల్సి ఉంటుంది. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు శ్రమ అధికం. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆహార, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 
 
సింహం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు తమ ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. విదేశీయాన యత్నాల్లో అడ్డంకులు తొలగిపోగలవు. మిమ్మల్నీ పొగిడేవారే కానీ, సహకరించేవారుండరు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. 
 
కన్య : దైవ దీక్షలు మొక్కుబడులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. కోర్టు వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వాహనం కొనుగోళ్లు అనుకూలిస్తాయి. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగంలో వారికి కలిసివచ్చేకాలం. సోదరీ, సోదరుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. 
 
తుల : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విద్యార్థినులలో ధ్యేయం పట్ల ఆసక్తి, కొత్త విషయాల పట్ల ఏకాగ్రత నెలకొంటాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలకు ఉపవాసాలు, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. 
 
ధనస్సు : దైవ దీక్షలు, యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గత కొంతకాలంగా అనుభవిస్తున్న రుగ్మతలు, చికాకులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు అకారణంగా మాటపడవలసి వస్తుంది. 
 
మకరం : కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. 
 
కుంభం : భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని సంతృప్తినిస్తాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకు ఉద్యోగులకు చికాకులు తప్పవు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. 
 
మీనం : విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి అక్షరదోషం వల్ల చికాకులు తప్పవు. ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శని గ్రహ వక్రదృష్టి ఫలితం ఎలా వుంటుంది?