Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-09-2021 గురువారం దినఫలాలు - సదాశివుని ఆరాధించినా...

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (04:00 IST)
శ్రీ ప్లవనామ సం|| భాద్రపద బి॥ నవమి సా.6.04 పునర్వసు, 10.58 ఉ.వ.9.56 ల 11.40, ఉదు.9.56 ల 1046 పు.దు 2.53 ల 3.43. సదాశివుని ఆరాధించి విభూది ధరించడంవల్ల సర్వారా శుభం కలుగుతుంది. 
 
మేషం:- పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులు నిర్లిప్తత ధోరణివల్ల సదవకాశాలు జారవిడుచుకుంటారు.
 
వృషభం:- ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రావలసిన ధనం ఆలస్యంగా చేతికందుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం.
 
మిథునం:- మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి ఆదరణ పొందుతారు. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది.
 
కర్కాటకం:- మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. సోదరుతో సంబంధ బాంధవ్యాలు బాగుగా కలిసివస్తాయి.
 
సింహం:- రౌజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రయ, విక్రయాలు లాభదాయకం. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలలో ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారంవుంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. 
 
కన్య:- చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.
 
తుల:- వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక ముఖ్య వ్యవహారమై దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది. నిర్మాణ పనుల్లో పనివారితో సమస్యలు తలెత్తుతాయి.
 
వృశ్చికం:- రవాణా రంగాలవారికి సంతృప్తి, పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రౌజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
ధనస్సు:- ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచికాదు. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వైజ్ఞానిక శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం:- చేపట్టిన పనిలో దృఢసంకల్పం ఉంటే విజయం తథ్యం. నూతన పరిచయాలేర్పడతాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. పట్టుదలతో శ్రమిస్తేకాని పనులు నెరవేరవు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. రాజకీయ నాయకులకు కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
కుంభం:- ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సతాకాలంను సద్వినియోగం చేసుకోండి. వైద్యులకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మీనం:- స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్చలు జరుపడం వల్ల జయం చేకూరుతుంది. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులు తప్పవు. ఫ్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భక్తి-ముక్తి, శక్తి-యుక్తి ఈ 4 అవసరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ (video)

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఏంజెల్ నంబర్ 1515 అంటే ఏమిటి? చూస్తే ఏం జరుగుతుంది?

క్షీరాబ్ధి ద్వాదశి.. సాయంత్రం పూట తులసీకోట ముందు దీపం తప్పనిసరి

నవంబర్ 17న తిరుమలలో కార్తీక వనభోజనం

13-11-2024 బుధవారం ఫలితాలు - కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి....

క్షీరాబ్ధి ద్వాదశి- తులసీ కోట వద్ద నేతి దీపం.. నువ్వుల నూనె వాడితే?

తర్వాతి కథనం
Show comments