Webdunia - Bharat's app for daily news and videos

Install App

29-08-2021 ఆదివారం దినఫలాలు - సూర్యుని ఆరాధించినా సర్వదా శుభం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. 
 
వృషభం : అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆహ్వానాలు లభిస్తాయి. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. 
 
మిథునం : స్త్రీలు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనపర్చడం వల్ల మందలింపులు ఎదుర్కోకతప్పదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు దూర ప్రాంతంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
కర్కాటకం : శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అతి కష్టంమీద అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
సింహం : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయాలలో విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. మిత్రులను కలుసుకుంటారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. 
 
కన్య : సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒకు పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాల్లో సానుకూలతలుంటాయి. కొంతమంది మిమ్మలను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. 
 
తుల : పట్టు, ఖాదీ కలంకారీ, చేనేత వస్త్ర వ్యాపారులకు అశాజనకం. ముందు చూపుతో వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోడం ఉత్తమం. 
 
వృశ్చికం : హోటల్, తినుబండారాలు, బేకరీ, పండ్లు వ్యాపారాలకు లాభదాయకం. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పారిశ్రామిక రంగంలోని వారికి కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
ధనస్సు : రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు వాయిదాపడతాయి. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫిలితాలు పొందుతారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మత్స్య, కోళ్ళ గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
మకరం : ఏజెంట్లకు, బ్రోకర్లకు రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకిత భావంతో పనిచేయాల్సి  ఉంటుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్త అవసరం. 
 
కుంభం : ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపై శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మీనం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ఒక స్థిరాస్తి విక్రయించే ఆలోచన విరమించుకోవడం మంచిది. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. దూర ప్రయాణాలు, ధన చెల్లింపుల్లో మెళకువ వహించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments