Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమన్వయకర్తలంతా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కారు : వైవీ సుబ్బారెడ్డి

వరుణ్
ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (15:51 IST)
తమ పార్టీ అధినేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గాలకు ప్రకటిస్తున్న సమన్వయకర్తలే వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు కారరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి బాంబు పేల్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎవరెవరన్నది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ అధికారికంగా ప్రటిస్తారని ఆయన తెలిపారు. 
 
వైజాగ్‌లోని ఎండాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, మార్చి మూడో తేదీన ప్రకాశం జిల్లాలో సిద్ధం బహిరంగ సభ ముగిసిన అనంతరం వైసీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని, నవరత్నాలు కొనసాగిస్తూనే మరిన్ని పథకాలను జోడిస్తామని తెలిపారు. ఆ తర్వాతే అధికారికంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 
 
ఇతర పార్టీల్లో నుంచి వైసీపీలో చేరిన వారికి ప్రజల్లో ఉన్న పేరు ఆధారంగా సీటు కేటాయించే అవకాశం ఉందని వివరించారు. వైసీపీలో ఎమ్మెల్యేలకు సీట్లతో పనిలేదని, వారికి టికెట్ దక్కకపోయినా సీఎంతోనే ఉంటారని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 
 
బీమా సొమ్ముకోసం పాము కాటుతో అమ్మమ్మను చంపేసిన కుమారుడు.. ఎక్కడ?
 
బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన అమ్మమ్మను పక్కా ప్రణాళికతో హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కుట్ర పన్ని పాముకాటుతో హత్య చేశాడు. షాకింగ్‌‍కు గురిచేస్తున్న ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో రాణి పఠారియా అనే మహిళ 8 నెలల క్రితం పాము కాటుతో చనిపోయింది. అయితే రూ. కోటి బీమా సొమ్ము కోసం మనవడే ఈ దారుణానికి పాల్పడ్డాడని తాజాగా బయటపడింది. కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది.
 
నిందితుడు ఆకాశ్ ఓ పాములు పట్టే వ్యక్తికి రూ.30 వేలు సుఫారీ ఇచ్చి పాముకాటుతో చంపించాడని పోలీసులు గుర్తించారు. మహిళ మరణ ఘటనపై కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితుడు ఆకాశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అదేసమయంలో మహిళ మరణం సాధారణ పాముకాటు మాదిరిగా లేదని పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. దీంతో తమదైన రీతిలో విచారణ చేయడంతో నిందితుడు ఆకాశ్ నేరాన్ని అంగీకరించాడు. బీమా సొమ్ము కోసమే ఈ పన్నాగం పన్నినట్టు వెల్లడించాడు.
 
రాత్రికిరాత్రి కోటీశ్వరుడిని కావాలనే ఆశతో తొలుత బీమా చేయించి పథకం ప్రకారం కొన్నాళ్ల తర్వాత హత్య చేయించినట్టు తెలిపాడు. ఈ హత్యలో నిందితుడితో పాటు బీమా ఏజెంట్ పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు ఆకాశ్, బీమా ఏజెంట్, పాముల పట్టే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా అమ్మమ్మ చనిపోయాక నిందితుడు రూ.కోటి బీమా సొమ్ము అందుకున్నాడని పోలీసులు వివరించారు. అతడి నుంచి రూ.10 లక్షల నగదు, కొన్ని నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments