జగన్‌కు ఓటేశాం... మా గ్రామానికేం చేశారు : తమ్మినేని సీతారాంకు ప్రశ్నల వర్షం

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (10:35 IST)
గత ఎన్నికల్లో తమ అభిమాన నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు అని భావించి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే మా గ్రామానికి ఏం చేశారంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను సొంత పార్టీ నేతలు, మద్దతుదారులు నిలదీశారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తమ్మినేని సీతారాం పారిపోయారు. 
 
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లపేట గ్రామంలో శుక్రవారం గడపగడపకూ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ బడే రఘురాం ఆధ్వర్యంలో పలువురు వైసీపీ మద్దతుదారులు స్పీకర్ వద్దకు వచ్చారు. వైసీపీకి ఓట్లు వేసి గెలిపించినా తమ గ్రామానికి ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా గ్రామంలో రోడ్లు, కాలువలు వేయలేదన్నారు. వీటిని ఎప్పుడు వేయిస్తారో చెప్పితీరాలని పట్టుబట్టారు. గ్రామ సమీపంలో కొండను కొంతమంది ఆక్రమించుకున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గ్రామంలో రోడ్ల పరిస్థితి చూడాలంటూ.. గుంతలు పడి నీరు నిలిచిన రోడ్డును చూపించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో తనకంతా తెలుసని, సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి స్పీకర్ అక్కడి నుంచి చెప్పాపెట్టకుండా జారుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments