Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టిన వైకాపా

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార వైకాపా జోరు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం, కుప్పం మున్సిపాలిటీలో కూడా ఫ్యాను గాలివీస్తుంది. 
 
ఈ మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలు ఉండగా, ఒక సీటు ఏకగ్రీవం అయింది. మిగిలిన 24 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు ఫలితాలు వెలువడిన వాటిలో వైసీపీ 14 స్థానాలను సొంతం చేసుకోగా, టీడీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది.
 
ఇక అనంతపురం జిల్లాలోని పెనుగొండ మున్సిపాలిటీలో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. పెనుగొండలో 20 స్థానాలకు గాను వైసీపీ 18 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ ఖాతా తెరవలేదు. అదేవిధంగా ఎనిమిది నగరపంచాయతీల్లో అధికారపార్టీ గెలుపొందింది.
 
అలాగే, అనంతపురం జిల్లా పెనుకొండలో వైసీపీ విజయదుందుభి మోగించింది. మొత్తం 20 వార్డులకు గాను 18వ వార్డులో గెలుపొందింది. రెండు వార్డులలో మాత్రమే టిడిపి విజయం సాధించింది. 
 
పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికలలో వైసిపికి చెందిన 9వ వార్డు అభ్యర్థి 437 ఓట్లు, 10వ వార్డు అభ్యర్థి 358 ఓట్లు, 11వ వార్డు అభ్యర్థి 44 ఓట్లు, 12వ వార్డు అభ్యర్థి 186 ఓట్లు 5వ వార్డు అభ్యర్థి 374 ఓట్లు, 6వ వార్డు అభ్యర్థి 288 ఓట్లు, 7వ వార్డు అభ్యర్థి 301 ఓట్లు, 8వ వార్డు అభ్యర్థి 259 ఓట్లు, 2వ వార్డు 472 ఓట్లు, 4వ వార్డు 192 ఓట్లు, టిడిపికి చెందిన 1వ వార్డు అభ్యర్థి 152 ఓట్లు, 3వ వార్డు అభ్యర్థి 175 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments