ఒకవైపు హైకోర్టు షాక్.. మరోవైపు విజయసాయిరెడ్డికి కేంద్రంలో కీలక పదవి

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:46 IST)
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రంలో కీలక పదవి దక్కింది. పార్లమెంటు‌లో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఓ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా పీఏసీలో సభ్యుడిగా కొనసాగుతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రధాన విధి కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను, ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడం. కాగా, తాజా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటుపై రాజ్యసభ ప్రధాన కార్యదర్శి దేశ్ దీపక్ శర్మ పార్లమెంటు బులెటిన్ ద్వారా వెల్లడించారు. విజయసాయి, సుధాంశు త్రివేది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు.
 
ఇదిలా ఉంటే..ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది హైకోర్టు. ముందుగా ఈడీ కేసులను విచారిచాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో విజయ సాయి రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.
 
 మొదట సీబీఐ లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే… ఎంపి విజయ సాయిరెడ్డి వాదనను తోసిపుచ్చుతూ, సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టి వేసింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments