Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీని - పార్టీ అధినేతను పల్లెత్తు మాట అనలేదు.. : వైకాపా ఎంపీ

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (19:36 IST)
వైకాపా అధిష్టానం పంపిన షోకాజ్ నోటీసుపై వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ సభ్యుడు, వైకాపా నేత రఘురామకృష్ణంరాజు స్పందించారు. షోకాజ్ నోటీసు తనకు అందిందని చెప్పారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఈ నోటీసులు పంపించారని తెలిపారు. అయితే, తాను పార్టీని లేదా పార్టీ అధినేతను మాత్రం పల్లెత్తు మాట అనలేదని గుర్తుచేశారు. 
 
పార్టీకి, పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడారని, పార్టీ ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యానించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వారంలో రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని... లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని నోటీసులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
 
ఈ నోటీసులపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనకు నోటీసులు అందాయని ఆయన తెలిపారు. తాను ఏనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని చెప్పారు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని... అయితే, ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా చెప్పానని ఆయన అన్నారు. పైగా, తాను చెప్పదలచుకున్న విషయాలు మీడియా ద్వారానే చెప్పినట్టు, ఇక కొత్తగా చెప్పేది ఏమీ లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments