Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ లేని సమయాల్లో పవన్‌కు ప్రత్యేక హోదా గుర్తుకొస్తుందా? పబ్లిసిటీ కోసం పోరాటమా?

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా ఎవరు పోరాడినా తాను మద్దతిస్తానని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (18:29 IST)
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా ఎవరు పోరాడినా తాను మద్దతిస్తానని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పోరాడటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ను ప్రభుత్వం స్పాన్సర్ చేస్తోందన్నారు.

షూటింగ్ లేని సమయాల్లోనే పవన్‌కు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చిందన్నారు. ఖాళీ సమయాల్లో ఉద్యమాలు చేసే వారు నాయకులు కాలేరని కూడా ఆమె పవన్ కల్యాణ్ కు చురకలు అంటించింది. పబ్లిసిటీ కోసం పోరాటం చేస్తే సరికాదన్నారు. 
 
ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చేసినా.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రం వెంటే ఉన్నారని రోజా మండిపడ్డారు. తన సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని..  ప్రత్యేక హోదా వస్తేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని అన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు హోదా కావాలన్నారు. టిడిపి నేతలు స్వరాష్ట్ర ప్రయోజనాలను ప్రత్యేక హోదా కోసం తాకట్టు పెడుతున్నారన్నారు.
 
ఇకపోతే.. తాను అసెంబ్లీకి వెళ్లి తీరతానని ప్రకటించారు. అసెంబ్లీ కార్యాలయం వరకు వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతి ఇచ్చిందని.. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి తీరతానని స్పష్టం చేశారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments