Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చా : ఆర్కే.రోజా

మా నాన్న కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చానని సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా చెప్పుకొచ్చారు. ఆమె ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఆర్టిస్టు అవ్వాలన్నది తన తండ్రి కోరిక అని,

Webdunia
సోమవారం, 15 మే 2017 (09:37 IST)
మా నాన్న కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చానని సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా చెప్పుకొచ్చారు. ఆమె ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఆర్టిస్టు అవ్వాలన్నది తన తండ్రి కోరిక అని, అందుకే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. 
 
‘నేను సినిమాల్లోకి రావడం మా అమ్మకు, అన్నయ్యలకు ఇష్టం లేదు. మా నాన్న సారథి స్టూడియోస్‌లో సౌండ్ ఇంజనీర్‌గా చేసేవారు. ‘ఆర్టిస్ట్‌గా నాకు రాని అవకాశం నీకు వచ్చింది. నటిస్తే బాగుంటుంది’ అని మా నాన్న అన్నారు. మా అమ్మ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా చేసేవారు. నాకు తోడుగా ఉండాలని చెప్పి, తాను చేస్తున్న ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టింది. అలాగే మా అన్నయ్యలు కూడా వాళ్ల చదువులు వదిలి పెట్టి నాకు తోడుగా చెన్నైకు వచ్చారు.
 
ఎందుకంటే, మా మూడు జనరేషన్స్‌లో నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. మిగిలిన ఆర్టిస్టుల తల్లుల కంటే మా అమ్మ చాలా అమాయకురాలు. మా అన్నయ్యలు ఏం చెబితే అది. మా అమ్మ నాతో పాటు షూటింగ్‌కు రావడం, నాకు భోజనం పెట్టడం, మళ్లీ షూటింగ్ నుంచి నాతో పాటు రూమ్‌‌కు రావడం తప్పా, ఆమెకేమీ తెలియదు. సిస్టమేటిక్‌గా ఈ రోజున నేను ఉన్నానంటే, దానికి కారణం మా అమ్మే. ఆమె నుంచే నేను నేర్చుకున్నాను’ అని రోజా చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments