Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోర్ముయ్.. ఎవడ్రా పెద్దలు... తెల్లారేసరికి సూద్దురు గాని : వైకాపా ఎమ్మెల్యే బెదిరింపులు

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (08:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేస్తున్న విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. సాక్షాత్ ప్రజాప్రతినిధులతో పాటు.. మంత్రులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే(వైసీపీ) యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబురాజు) ఓ అభ్యర్థి అల్లుడికి ఫోన్‌ చేసి బెదిరించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆయన నియోజకవర్గంలోని రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం పదో వార్డు సభ్యుడిగా రుత్తల సత్యం అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. 
 
ఆయన కూడా వైసీపీకి చెందిన వ్యక్తే. అయితే ఎమ్మెల్యే కన్నబాబురాజు మరో వ్యక్తితో ఆ వార్డుకు నామినేషన్‌ వేయించారు. సత్యం రెబల్‌గా మారారు. సత్యం అల్లుడు సంతోష్‌ వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండురోజుల క్రితం సంతోష్‌కు ఎమ్మెల్యే కన్నబాబురాజు ఫోన్‌ చేసి తీవ్రస్థాయిలో బెదిరించారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశించారు. 
 
దీనిపై సంతోష్ బుధవారం రాంబిల్లి ఠాణాలో ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఆడియో రికార్డింగ్‌నూ పోలీసులకు అందజేశారు. తన మామ ఇల్లు పడగొడతానని కూడా ఎమ్మెల్యే బెదిరించారని, ఆ మరుసటిరోజే అధికారులు ఇల్లు పడగొట్టడానికి ప్రయత్నించారని, వైసీపీలో మరో నాయకుడు డీఎస్‌ఎన్‌ రాజు తన కుటుంబాన్ని కడతేరుస్తానని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఎమ్మెల్యే చేసిన బెందిరింపులను ఓ సారిపరిశీలిస్తే, 
 
ఎమ్మెల్యే: ఏం నామినేషన్‌ వేశావట. వెటకారంగా ఉందేటి? 
సంతోష్‌: నేను కాదు సార్‌.
ఎమ్మెల్యే: నువ్వు కాకపోతే...నీ మావ. మావో..గీవో.. నువ్వు చెప్పు. లేదంటే రేంజర్‌తో కంప్లయింట్‌ చేయించి బొక్కలో తోయించేస్తాను.  
సంతోష్‌: నాలుగేళ్ల నుంచి రేంజర్‌ బిల్లు ఇవ్వలేదు సార్‌. రూ.2.5 లక్షలు రావాలి.
ఎమ్మెల్యే: ఒక్క రూపాయి కూడా రాదు. ఆలోచించుకో.
సంతోష్‌: ఇవ్వకపోతే పోనీయండి సార్‌. అడుక్కొని తింటాం.
ఎమ్మెల్యే: అలాగైతే దానికి ప్రిపేర్‌ అయిపో...
సంతోష్‌: అది కాదు సార్‌. ఊళ్లో పెద్దలంతా కలిసి నిలబెట్టారు.
ఎమ్మెల్యే: నోర్ముయ్‌...! ఎవడ్రా పెద్దలు.? అంత మొగాడు ఎవడూ లేడక్కడ...
సంతోష్‌: సుమంత్‌ చిన్నాన్న నిలబెట్టారు సర్‌.
ఎమ్మెల్యే: అదే.. ఆ సుమంత్‌ గాడి మిషన్‌, బిల్డింగ్‌ తెల్లారేసరికి కొడతారు. సూద్దురు గాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments