Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాటరాక్ట్‌ ఆరంభం- హెచ్చరిక గుర్తులు మరియు కారణాలు

క్యాటరాక్ట్‌ ఆరంభం- హెచ్చరిక గుర్తులు మరియు కారణాలు
, గురువారం, 21 జనవరి 2021 (19:49 IST)
ఓ అద్దంలో చూసిన మాదిరి లేదా మంచుతో కప్పబడిన లేదా దుమ్ముతో కూడిన కారు కిటికీల నుంచి చూసినప్పుడు ఏ విధంగా అయితే స్పష్టంగా కనిపించదో, అదే తరహా కంటి చూపును సాధారణ వేళలో కూడా ఒకరు కలిగి ఉంటే, వైద్య పరంగా ఆ స్థితిని క్యాటరాక్ట్‌ అంటారు. సాధారణంగా ఈ క్యాటరాక్ట్‌ అనేది వయసు మీద పడిన వారిలో కనిపించినప్పటికీ, పలు కారణాల రీత్యా చిన్నారులు మరియు యువతలో కూడా ఈ సమస్య కనబడుతుంది. ఒకవేళ క్యాటరాక్ట్‌ పుట్టిన సమయంలోనే ఉంటే దానిని కాన్జెన్షియల్‌ క్యాటరాక్ట్‌ అంటారు.
 
మన కళ్లలో సహజసిద్ధంగానే కటకాలు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి అవి చాలా పారదర్శకంగా ఉంటాయి. రెటీనాపై కాంతి పడగానే ఈ కటకాలు మనం స్పష్టంగా చూసేందుకు సహాయపడతాయి. దానికోసం ఈ కటకాలు చాలా స్పష్టంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. జాతీయ నేత్ర సంస్థ (నేషనల్‌ ఐ ఇనిస్టిట్యూట్‌) చెప్పేదాని ప్రకారం, ఒకటి లేదా రెండు కళ్లలోనూ కటకాలు తెల్లగా/మసగ్గా/కాంతిచొరబడనీయకుండా మారితే, స్పష్టంగా వారు చూడటంపై అది ప్రభావం చూపుతుంది. ఈ స్థితిని క్యాటరాక్ట్‌ అంటారు. తొలి దశలో చాలా వరకూ క్యాటరాక్ట్‌లు మన దృష్టిలో ఎలాంటి ప్రభావం చూపినట్లుగా అనిపించవు కానీ క్యాటరాక్ట్‌ స్థితి పెరిగే కొద్దీ , అది ఆ వ్యక్తుల కంటి చూపు మరియు నేత్ర దృష్టి నాణ్యతపై ప్రభావం చూపుతుంది.
 
తొలి దశలో, క్యాటరాక్ట్‌కు కంటి అద్దాలతో చికిత్స చేస్తారు. వయసుతో పాటుగా శరీరంలో వచ్చే మార్పులకు, క్యాటరాక్ట్‌కు సంబంధం ఉంటుంది. మన శరీర ఆరోగ్యం నిర్వహించడంతో పాటుగా కంటి చూపు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తద్వారా మన కంటి లోపల క్యాటరాక్ట్‌ మార్పులను నెమ్మదింపజేయడం లేదా ఆలస్యం చేయడం చేయవచ్చు.
 
క్యాటరాక్ట్‌ బారిన పడేందుకు మరియు వేగంగా క్యాటరాక్ట్‌ వృద్ధి చెందేందుకు కొన్ని అంశాలు ఉత్ర్పేరకంగా నిలుస్తుంటాయి. వాటిలో మధుమేహం, ఆర్థరైటీస్‌ లాంటి వాటి చికిత్స కోసం దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్స్‌ను వినియోగించడం లేదా కొన్ని రకాల ఔషదాలు వంటివి ఉంటాయి. దీనితో పాటుగా కంటికి గాయాలు కావడం, మన శరీరపు పై భాగానికి రేడియేషన్‌ చికిత్స కావడం,  సన్‌గ్లాసెస్‌ ధరించకుండా అధికంగా సూర్యకాంతికి గురి కావడం (అలా్ట్రవయొలెట్‌ రేడియేషన్‌) మరియు కొన్ని రకాల జీవనశైలి ప్రాధాన్యతలైనటువంటి అధికంగా పొగత్రాగడం,మద్యం తీసుకోవడం లేదా ఊబకాయం కూడా కారణమవుతుంది.
 
క్యాటరాక్ట్‌కు సంబంధించి కొన్ని ముందస్తు హెచ్చరికలను గురించి డాక్టర్‌ ఆల్ఫా అతుల్‌ పూరాబియా, సీనియర్‌ రిఫ్రాక్టివ్‌, కార్నియా అండ్‌ క్యాటరాక్ట్‌ సర్జన్‌, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌ ఈవిధంగా వెల్లడించారు.
 
మబ్బుపట్టినట్లుగా లేదా మసగ్గా కనిపించడం: తొలుత కంటి చూపును అద్దాలతో సరిచేస్తారు. కానీ, క్యాటరాక్ట్‌ వృద్ధి చెందేకొద్దీ అద్దాలతో కూడా కంటిచూపు మెరుగుపడదు. కంటి చూపు మబ్బుగా లేదంటే మేఘావృతమైనట్లుగా లేదా రంగులు సరిగా కనబడకపోవడం జరుగుతుంది.
 
రంగులు సరిగా కనబడకపోవడం లేదా పసుపు రంగులో ఉండటం: ప్రకాశవంతమైన రంగులు కూడా పాలిపోయినట్లుగా లేదా పసుపు రంగులో కనబడతాయి.
 
కాంతిని చూడడంలో ఇబ్బంది పెరగడం: ఈ గుర్తును తొలి దశ క్యాటరాక్ట్‌గా భావించాల్సి ఉంటుంది. మన కళ్లు ప్రకాశవంతమైన కాంతిని చూసినప్పుడు అసౌకర్యంగా భావించడం జరుగుతుంది.
 
రాత్రిపూట సరిగా కనిపించకపోవడం: చదువుతున్నప్పుడు మరింత అధికంగా కాంతి కావాల్సి ఉండటం లేదా రాత్రి పూట కాంతి ఉన్నప్పటికీ సరిగా కనిపించకపోవడం జరిగితే తొలి దశ క్యాటరాక్ట్‌గా భావించాల్సి ఉంటుంది. ఇది కాలంతో పాటుగా పెరిగి కొన్నాళ్లకు రాత్రి పూట ఆ వ్యక్తులు కారు నడపటానికి ఇబ్బంది పడటం లేదా ఎదురుగా కార్లు వస్తుంటే ఆ కార్ల దీపాలకు ఇబ్బంది పడటం జరుగుతుంది.
 
కాంతి వలయాలు కనిపించడం మరియు దీపాల చుట్టూ వలయాలు కనిపించడం: క్యాటరాక్ట్‌ పెరగడం ఆరంభమైన తరువాత, కాంతి చుట్టూ వలయాలను చూడటం ఆరంభమవుతుంది. దీనితోపాటుగా కాంతి వనరులు వద్ద కూడా వలయాలు కనిపిస్తుంటాయి. దీనినే గ్లేర్‌ అంటారు. ఈ తరహా స్థితిని పగటిపూట గమనించలేము కానీ రాత్రి పూట మాత్రం ఇది తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది.
 
రెండుగా కనిపించడం: క్యాటరాక్ట్‌లో కనిపించే మరో సమస్య ఏమిటంటే ఒకరుకు బదులు ఇద్దరుగా కనిపించడం లేదా దెయ్యం చిత్రాల్లా కనిపించడం.
 
వ్యక్తులను బట్టి ఈ క్యాటరాక్ట్‌ వృద్ధి కూడా మారుతూ ఉంటుంది. కొంతమంది రోగులకు ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. దానికి సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కొంతమంది రోగులలో ఇది వేగంగా కనిపించవచ్చు. నివారించతగిన అంధత్వంకు అతి సాధారణ కారణాలో ఒకటిగా క్యాటరాక్ట్‌ నిలుస్తుంటుంది. ఒకవేళ ఈ తరహా వైద్యస్థితికి సుదీర్ఘకాలం పాటు చికిత్స అందించని ఎడల శాశ్వత అంధత్వంకు అది దారితీయవచ్చు.
 
ఈ కారణం చేతనే, 40 సంవత్సరాలు దాటిన తరువాత, సమగ్రమైన కంటి పరీక్షలను చేయించుకోవాలి. దానిలో దృష్టి మరియు కంటి ఒత్తిడి పరీక్షలు కూడా చేయించుకోవాలి. అలాగే స్లిట్-ల్యాంప్‌ పరీక్షలు, విస్ఫారణం (డిలాటేషన్‌) తరువాత రెటీనా పరీక్షలను నిష్ణాతులైన నేత్ర వైద్యుల వద్ద తరచుగా చేయించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఆహారంలో బాదములను ఎందుకు చేర్చాలో 3 ముఖ్య కారణాలు