Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసాపురం ఎంపీకి వైకాపా షోకాజ్ నోటీసు!?

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (13:53 IST)
అధికార వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసింది. ఆయన పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. 
 
బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వుంటూ సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని  పేర్కొన్నారు. 
 
అలాగే, పలు సందర్భాలలో ఆయన మీడియా ముందు పార్టీ, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది. 
 
కాగా, ఇటీవల సీఎం జగన్ యేడాది పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాష్ట్రంలో ఇసుక దోపిడీ పెరిగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments