Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారుపై ప్రతిపక్షాల అవిశ్వాసం.. విశ్వాస పక్షంగా వైకాపా

Webdunia
గురువారం, 27 జులై 2023 (12:35 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు అనేక ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఇందుకోసం లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసును ఇచ్చింది. దీన్ని స్వీకరించిన ఆయన.. అవిశ్వాస పరీక్షకు సమ్మతం తెలిపారు. అయితే, ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ సర్కారుకు విశ్వాసంగా ఉండాలని వైకాపా నిర్ణయించింది.
 
గత 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి మరోమారు అండగా నిలవాలని నిర్ణయించింది. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని బయటపడేయడంతోపాటు ఢిల్లీలో సేవల నియంత్రణకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లుకు కూడా మద్దతివ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ రెండు గండాల నుంచి ప్రభుత్వం ఈజీగా బయటపడేలా కనిపిస్తోంది.
 
వైసీపీకి రాజ్యసభలో 9 మంది, లోక్‌సభలో 22 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లుల సమయంలో వీరంతా అండగా నిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సేవల నియంత్రణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించినా రాజ్యసభలో తగినంత మెజారిటీ లేకపోవడంతో అక్కడ చిక్కుకుపోయే అవకాశం ఉంది.
 
ఈ పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయడం ద్వారా దానిని బయటపడేయాలని చూస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో మరింత స్పష్టతనిచ్చారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా, బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments