Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (17:50 IST)
వైకాపాకు చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదైవున్నాయి. ఈ నాలుగు కేసుల్లో ఆయన ఇప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై బయట ఉంటున్నారు. కానీ, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం.. నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించింది. ఈ పిటిషన్లపై జూన్ 20వ తేదీన హైకోర్టులో వాదనలు ముగియగా, బుధవారం తీర్పును వెలువరించింది. 
 
కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంలను బద్ధలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను కూడా దుర్భాషలాడారు. పోలింగ్ మరుసటి రోజున పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లోనే ఆయనను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments