Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా నిధుల జమ

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (09:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు తీపి కబురు చెప్పారు. గత 2021 ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు చెప్పిన మాట ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్‌లోనే రూ.2,977.82 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ బీమా సొమ్మును రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. 
 
కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా రైతుల తరపున పూర్తి ప్రీమియం చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది. సాగు చేసిన ప్రతి ఎకరానికి ఈ-క్రాప్‌లో మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తుంది. 
 
బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనిద్వారా ఉచిత పంటల బీమాను ఒక సీజన్‌ది మరో యేడాది అదే సీజన్ రాకముందే చెల్లిస్తూ వస్తుంది. ఇందులోభాగంగా, ఇపుడు సీఎం ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments