Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్. జగన్ అవతారమెత్తనున్న నటుడు సూర్య...

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నటుడు సూర్య ఎందుకు అనుకరిస్తాడు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వై.ఎస్.ఆర్ క్యారెక్టర్ కోసం మలయాళ హీరో మమ్ముట్టిని ఎంచు

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (19:03 IST)
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నటుడు సూర్య ఎందుకు అనుకరిస్తాడు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వై.ఎస్.ఆర్ క్యారెక్టర్ కోసం మలయాళ హీరో మమ్ముట్టిని ఎంచుకోగా హీరోయిన్‌గా మొదటగా నయనతారను ఎంచుకున్నారు.
 
కానీ ఆ తరువాత ఆ క్యారెక్టర్ చేయడానికి ఆమె ఒప్పుకోలేదు. రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ క్యారెక్టర్ చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. అందుకే నయనతార అలాంటి క్యారెక్టర్ చేయనని తేల్చి చెప్పేసిందట. అంతేకాదు రాజకీయ నేపథ్యంలో ఉండే సినిమా కాబట్టి ఆ సినిమా అస్సలు వద్దనుకుందట. దీంతో చివరకు రమ్యక్రిష్ణను ఆ క్యారెక్టర్ చేయడానికి దర్శకుడు ఒప్పించారట. తనకు పేరు తెచ్చే క్యారెక్టర్ ముఖ్యమని, అలాంటిది ఏదైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతోంది రమ్యక్రిష్ణ. 
 
ఇక జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్‌ను సూర్య చేయనున్నారట. జగన్, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. అందుకే జగన్ క్యారెక్టర్‌ను సినిమాలో చేయడానికి సూర్య ఒప్పుకున్నారట. వై.ఎస్.ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన. కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం లాంటివి ఈ సినిమాలో దర్శకుడు చూపనున్నారట. ఈ సినిమా వై.ఎస్. కుటుంబం గొప్పతనాన్ని, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజినిచ్చే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నాయకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments