Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మ తోడుగా... మా కుటుంబం చీలిపోవడానికి కారణం జగనన్నే : వైఎస్ షర్మిల

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (09:57 IST)
ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాకుండా, తమ కుటుంబాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీల్చిందంటూ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తమ కుటుంబం చీలిపోవడాని కాంగ్రెస్ పార్టీ కాదనీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియంతగా మారిన తన అన్న జగన్మోహన్ రెడ్డేనని తేల్చిపడేశారు. దీనికి మా అమ్మ విజయలక్ష్మి, యావత్ మా కుటుంబమే సాక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. 
 
ఏలూరులో జరిగిన ఉభయగోదావరి జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. "వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలిపోవడం చేతులారా జగన్ చేసుకున్నదే. ఆయన వల్లే చీలిపోయింది. దీనికి సాక్ష్యం మా తల్లి విజలక్ష్మి. ఆ దేవుడు సాక్ష్యం. నా యావత్ కుటుంబమే సాక్ష్యం అని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పూర్తిగా మారిపోయారని" చెప్పారు. 
 
తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా రాష్ట్రానికి మేలు చేస్తే చాలనుకున్నాను. మంచి ముఖ్యమంత్రి అనిపించుకుని వైఎస్ఆర్‌కు మంచి పేరు తెస్తే చాలనుకున్నాను. కానీ ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముంచేశాడు. భారతీయ జనతా పార్టీకి వైకాపాను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను బానిసలుగా మార్చేశాడు. పూర్తి నియంతలా మారిపోయాడు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులోనే ఉండిపోయాడు. ప్రజలను కలవడమే మానేశాడు. పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛే లేకుండా చేశాడు. వైఎస్ ప్రజల మనిషి అయితే.. జగన్ ప్రజలకు దూరంగా మెలిగే వ్యక్తి అని ఆమె ఆరోపించారు. 
 
వైఎస్ వారసులమని చెప్పుకుంటే సరిపోదని, పాలనలోనూ ఆయన కనిపించాలన్నారు. వీరిద్దరి పాలనకు భూమికి - ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడమే కాకుండా, తమ కుటుంబాన్ని కూడా చీల్చిందని ఇటీవల జగన్ మాట్లాడాడని, కానీ, రాష్ట్రం అభివృద్ధి లేకుండా దయనీయంగా ఉండటానికి ఆయనే కారణమన్నారు. 
 
అలాగే, సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండడంతో పార్టీని బలోపేతం చేసేందుకు అప్పుడే జిల్లాల పర్యటన ప్రారంభించిన షర్మిల తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఏపీ ప్రజలు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదని, ఎంతగా పతనమైందో మనందరికీ తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. 
 
హోదా వచ్చి ఉంటే బోల్డన్ని ప్రయోజనాలు కలిగి ఉండేవన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వకపోయినా, పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా, రాజధాని ఇవ్వకున్నా చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి మన హక్కుల్ని సాధించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. అయినప్పటికీ బీజేపీ కోసం టీడీపీ, వైసీపీ పనిచేస్తున్నాయని దుమ్మెత్తిపోశారు.
 
ఏపీ నుంచి గత పదేళ్లలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించకున్నా రాష్ట్రాన్ని పాలిస్తోందని విమర్శించారు. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు.

తమతో చేతులు కలపాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కోరుతున్నానని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని, రాహుల్గాంధీ ప్రధాని అయితే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని, రాష్ట్రాన్ని బతికించుకుందామని పేర్కొన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో యాక్టివ్‌గా పనిచేయాలని కోరారు. సపోర్ట్ చేయాలని, 9550803366కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని షర్మిల పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments