Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ వదిలిన బాణం వైఎస్ షర్మిల ... నేను : థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వి

Prudhvi Raj

వరుణ్

, మంగళవారం, 23 జనవరి 2024 (15:33 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ హాస్య నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వి అన్నారు. పైగా, తాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వదిలిన బాణాన్ని అని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల మాత్రం కాంగ్రెస్ వదిలిన బాణం అని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మార్చి నెలలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు. సినిమాలు, సినిమా కలెక్షన్లు, పంపిణీదారులు గురించి మాట్లాడేవారు కూడా మంత్రులేనా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మంత్రి అంబటి రాంబాబుకు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. ఈ అంబటి రాంబాబు.. ఎపుడు చూసినా మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడతాడని విమర్శించారు. 
 
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందా అని నిలదీశారు. చివరకు మూడు రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు వైకాపా తనను వాడుకుని వదిలిపివేసిందని త్వరలోనే వీళ్లందరికీ తగిన రీతిలో సమాధానం చెపుతానని పృథ్వి హెచ్చరించారు. 
 
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం అని చెప్పారు. ఆమె కారణంగా అధికార వైకాపాకు ఇబ్బందులు తప్పవన్నారు. 136 సీట్లతో టీడీపీ - జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిసి 136కు పైగా సీట్లను గెలుచుకుంటాయని చెప్పారు. 175 సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన వైకాపా నేతలు ఇపుడు ఎందుకు వణికిపోతున్నారని, స్థానాలు మార్చినంతమాత్రాన ప్రజలు ఓటు వేయరని ఆయన గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు నవ్వులు చిందిస్తూ.. కళ్లు ఆర్పుతున్న బాల రాముడు (Video)