Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ముగియనున్న వైఎస్ షర్మిల ఇంటి వివాహ వేడుక.. డుమ్మాకొట్టిన అన్న జగన్!!

వరుణ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (10:01 IST)
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల - అనిల్ కుమార్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుక ఆదివారంతో ముగియనున్నాయి. బంధువులు, సన్నిహితుల సమక్షంలో శనివారం సాయంత్రం ఈ పెళ్లి వేడుక జరగింది. హాల్దీ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, ఈ పెళ్లి వేడుకకు హాజరుకావాలని తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల స్వయంగా అందజేశారు. కానీ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారే కానీ, పెళ్లికి మాత్రం డుమ్మా కొట్టారు. ఈ వివాహ వేడుక రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నూతన దంపతులు వైఎస్ రాజారెడ్డి, ప్రియా వివాహ ఘట్టానికి షర్మిల దంపతులతో పాటు షర్మిల తల్లి విజయమ్మ, కూతురు అంజలి, వధువు అట్లూరి ప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులుతో పాటు అతి కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. 
 
అయితే, ఈ వివాహ వేడుకకు అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డిలు హాజరుకాలేదు. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ అనివార్య కారణాల వల్ల హాజరుకాలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వధూవరులు ఇక్కడికి వచ్చాక ప్రత్యేకంగా వెళ్లి ఆశీర్వదించనున్నట్టు సమాచారం. కాగా, ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన మూడు రోజుల పెళ్లి వేడుక ఆదివారంతో ముగిసింది. ఇందులో సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో సందడి సందడిగా జరిగాయి. ఆదివారం తలంబ్రాలు, విందు కార్యక్రమాలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments