Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (19:55 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిలుపై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో వివేకా కుమార్తె సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను ఏమైనా చేస్తారనే భయం తమలో ఉందని చెప్పారు. ఇటీవల తనకు కొన్ని విషయాలు తెలిశాయని, అవి తనను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు. 
 
అవిశాన్ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను పేర్కొందని తెలిపారు. విచారణ అధికారులను అవినాశ్ పిలిపించుకుని బెదిరించినట్టు అందులో పేర్కొన్నారని, తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాశ్ సంతకాలు చేయించినట్టు ఉందని చెప్పారు. 
 
అవినాశ్ బెయిల్‌పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని అన్నారు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించినట్టు తప్పుడు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హత్య జరిగినపుడు ఘటనాస్థలిలో ఉన్నది అవిశాన్ రెడ్డేనని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments