Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళకు చెప్పులు లేకుండా చినజీయర్ స్వామి కాళ్లను తాకి ఆశీస్సులు పొందిన జగన్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (12:53 IST)
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు.
 
తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపిన జగన్, చినజీయర్ స్వామితో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. 'నా పాదయాత్ర ప్రారంభించడానికి ముందు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిగారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నా' అని ఆ ట్వీట్‌లో జగన్ పేర్కొన్నారు. 
 
అంతకుముందు చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసునేందుకు జగన్ ఆయన రెండు కాళ్లను తాకి నమస్కరించారు. మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జగన్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా... అక్కడికి సమీపంలోనే ఉన్న చినజీయర్‌ ఆశ్రమానికి వెళ్లారు. ఈ సమయంలో పార్టీ ముఖ్యనేతలెవరూ వెంట లేరు. ‘జిమ్స్‌’ ఆస్పత్రి వద్ద జగన్‌‍కు జీయర్‌ స్వయంగా స్వాగతం పలికారు.
 
ఆస్పత్రిలోని తన కార్యాలయానికి లిఫ్టులో తీసుకెళ్లారు. ఈ సమయంలో జగన్‌ పూర్తి వినయపూర్వకంగా వ్యవహరించారు. చేతులు కిందికి వదలకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా ఆయనతో నడిచారు. జీయర్‌ స్వామితో ఆయన కార్యాలయంలో కొద్దిసేపు చర్చించారు. 
 
జీయర్‌ సంస్థ నిర్వహిస్తున్న ఆస్పత్రిని జగన్‌ పరిశీలించారు. పేదలకు సేవలను అందిస్తున్నారంటూ ప్రశంసించారు. జగన్‌కు జీయర్‌ స్వామి కింది దాకా వచ్చి వీడ్కోలు పలికారు. అలా వెళ్లే సమయంలో... జగన్‌ తొలుత చేతులతో నమస్కరించి, ఆపై రెండు పాదాలను తాకి నమస్కరించి జీయర్‌ ఆశీస్సులను పొందారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments