Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagan: ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ-ఎమ్మెల్యేకి తక్కువ: జగన్ ఫైర్ (video)

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (14:23 IST)
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్యంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం ప్రజలు కోరుకోవడం లేదని, ఇప్పుడు దానిని ఇవ్వడం ప్రభుత్వ పరిధిలో లేదని డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనపై జగన్ స్పందించారు. 
 
"ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ… ఎమ్మెల్యేకి తక్కువ… జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు" అని జగన్ అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే హోదా కొత్తదనన్నట్లు జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లి పార్టీ పెట్టుకోవాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా జగన్ సెటైర్లు విసిరారు. 
 
ప్రతిపక్ష హోదాపైనా జగన్ మరోసారి మాట్లాడుతూ.. గతంలో ఢిల్లీలో బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే ఉంటే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిందని జగన్ గుర్తు చేశారు. 
 
తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష పార్టీగా హోదా లాగేస్తామంటే తానే వద్దన్నానని.. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్న సమయంలో ఎంత సమయం మాట్లాడతావో అంతసేపు మాట్లాడమని చెప్పానని జగన్ అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్పేందుకు మాత్రమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నా అంటూ జగన్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఆడియన్స్ థియేటర్స్ కి రారనే భయం లేదు : నిర్మాత దిల్ రాజు

స్క్రీన్ ప్లే కొత్తగా సైకో థ్రిల్లర్ నేపధ్యంలో ఆర్టిస్ట్ చిత్రం :సంతోష్ కల్వచెర్ల

ఒత్తిడిని తట్టుకోలేక అధిక మాత్రలు తీసుకుంది : కల్పన కుమార్తె (Video)

RC 16: హైదరాబాద్ షూట్ లో రామ్ చరణ్ RC 16 చిత్రంలో శివ రాజ్‌కుమార్ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments