ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) సీట్ల కేటాయింపును డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు ప్రకటించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ట్రెజరీ బెంచ్ ముందు వరుసలో సీట్లు కేటాయించబడ్డాయి. వారి తర్వాత, చీఫ్ విప్, విప్‌లకు, ఆపై సీనియారిటీ ఆధారంగా ఇతర ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించబడ్డాయి.
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు సీటు నంబర్ 1 కేటాయించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీటు నంబర్ 39 కేటాయించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు తెలిపారు. వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష బెంచ్‌లో ముందు వరుస సీటు ఇచ్చారు.
ఇకపోతే.. మాదకద్రవ్యాలు అనేది అతి పెద్ద సమస్యగా మారిందని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చెప్పిన విధంగా ఈ మాదకద్రవ్యాల విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే అవకాశాలపై అధ్యయనం చేస్తే బాగుంటుంది అని, తద్వారా రాబోయే కొన్ని తారలను కాపాడుకోవచ్చునని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనితకు రఘురామ కృష్ణం రాజు సూచించారు.