Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

Advertiesment
Nara Lokesh

సెల్వి

, బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (19:05 IST)
Nara Lokesh
అసెంబ్లీ వేదికగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. వైకాపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దళితులకు గుండు కొట్టించిన వారు, దళితులను చంపి డోర్ డెలివరీలు చేసినవారు వైసీపీ వారేనని మంత్రి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనమండలి సమావేశాల్లో నారా లోకేష్ ప్రసంగిస్తూ.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌ ఏం చేశారని ప్రశ్నించారు. 
 
దళితులపై దమనకాండ చేసి, మీరా దళితుల గురించి మాట్లాడేది?.. సంబంధం లేకుండా అనవసరంగా టాపిక్స్ మాట్లాడవద్దని వైకాపా నేతలపై మండిపడ్డారు. తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్‌లో మాట్లాడినా తప్పంటే ఎలా అంటూ వైకాపా నేతలను ఉద్దేశించి నారా లోకేష్ సెటైర్లు విసిరారు. 
 
రాష్ట్రం కోసమే టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయని నారా లోకేష్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పామన్నారు. అధికారంలోకి రాగానే రూ.13వేల కోట్లు రాష్ట్రానికి తీసుకొచ్చామని వెల్లడించారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని... విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడుకున్నామని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?