Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ వెళ్లాలి.. అనుమతివ్వండి.. సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (14:19 IST)
తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ వెళ్ళాలని అందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశఆరు. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
 
అంతకుముందు... యూరప్‌లో వచ్చే 6 నెలల్లో 60 రోజులు పర్యటించేందుకు అనుమతించాలంటూ రెండో నిందితుడైన విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. సాయిరెడ్డి తరపు న్యాయవాది జి. అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో కూడా విదేశాలకు వెళ్లిరావడానికి ఈ కోర్టు అనుమతించిందన్నారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేసు విచారణ ముందుకుసాగడంలేదని, అనుమతిని నిరాకరించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
 
ఇదిలావుంటే, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లికి తిరిగొచ్చారు. ఈ నెల 15వ తేదీన ఆయన బెంగళూరు వెళ్లారు. జూన్ నుంచి ఇప్పటివరకూ మొత్తం ఆరుసార్లు అక్కడికి వెళ్లొచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో జగన్‌కు వైకాపా నేతలు స్వాగతం పలికారు. వచ్చే నెలలో ఆయన యూకే పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న డిప్లమాటిక్ పాస్‌పోర్టును ఈ నెల 1న కార్యాలయంలో సమర్పించి సాధారణ పాస్‌పోర్టును తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments