మీతో ఏం మాట్లాడినా.... బయటకు వెళ్లిపోతుంది... ఇక్కడేమీ మాట్లాడొద్దు.. సీఎం

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (10:57 IST)
ఏపీ మంత్రి వర్గ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 'మీతో ఏం మాట్లాడినా... బయటకు వెళ్లాక మీరు ఎవరికో (మీడియానుద్దేశించి) ఒకరికి చెప్పేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుకోవడం ఎందుకులే' అని మంత్రులతో సీఎం జగన్ అన్నట్లు సమాచారం. 
 
సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సాధారణంగా మంత్రిమండలి ఎజెండా అంశాలపై చర్చ తర్వాత అధికారులను పంపేసి.. మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కొనసాగించడం ఆనవాయితీగా వస్తుంది. మంత్రులతో అప్పుడు ప్రభుత్వపరంగా చేస్తున్న కార్యక్రమాలు, వాటికి వస్తున్న స్పందన, ప్రతిపక్షాల విమర్శలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, పార్టీపరంగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడం వంటివాటిపై సీఎం మాట్లాడుతూ, వారి అభిప్రాయాలను తీసుకుంటుంటారు. 
 
కానీ, శుక్రవారం నాటి భేటీలో మాత్రం ఈ చర్చ ఏమీ వద్దని చెప్పి సీఎం సమావేశం ముగించుకుని వెళ్లిపోయినట్లు తెలిసింది. ఎజెండాపై చర్చ సందర్భంగా వైకాపా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర గురించి ప్రస్తావనకు రాగా, ఈ యాత్ర బాగా జరుగుతోందని సీఎం అనగా.. అవునంటూ మంత్రులు స్పందించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలపడంతో.. పలువురు మంత్రులు సీఎంను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments