Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరికీ మంచి చేశా.. రాష్ట్రానికి న్యాయం చేశా : ఏపీ సీఎం జగన్

Webdunia
ఆదివారం, 30 మే 2021 (14:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తూ వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నేటితో (ఆదివారం) రెండేళ్లు పూర్త‌యింది. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశామ‌ని చెప్పుకొచ్చిన జ‌గ‌న్‌.. రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉందన్నారు. 
 
రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. రెండేళ్ల పాల‌న పూర్త‌యిన నేప‌థ్యంలో ఆదివారం జ‌గ‌న్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని తెలిపారు. 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామన్నారు. 
 
ప్రతి గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బందికి సీఎం వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగామ‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.
 
అంతేకాకుండా, తన రెండేళ్ల పాలన ద్వారా విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచిందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేతగా రెండేళ్ల పాలనలోనే ఆచరణలో నిరూపించినట్టు చెప్పారు. ప్రజలు ఐదేళ్లకు కదా ఓటు వేసింది.. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రణాళికను అమలు చేయడం ఎందుకనే గత పాలకుని వైఖరికి భిన్నంగా నవరత్నాల ద్వారా ప్రజలకు చేసిన వాగ్దానాల్లో 95 శాతంపైగా ఇప్పటికే అమలు చేసినట్టు గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments