Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా? సీఎం జగన్

Webdunia
బుధవారం, 10 జులై 2019 (13:47 IST)
దేశానికి అన్నం పెట్టాల్సిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కులేని వారిగా మారిన కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. పైగా, ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వం, ఆ దిశగానే తమ పాలన సాగుతుందన్నారు.
 
ఆయన బుధవారం కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. 
 
గత ప్రభుత్వంలో చనిపోయిన రైతులను గుర్తించని వారు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. చనిపోయిన రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు నేరుగా వెళ్లి ఆయా కుటుంబాలకు అందించాలని కోరారు.
 
నిజానికి గత ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చినట్టు లేదని, అందువల్ల అలాంటి రైతులను గుర్తించి, 2014-19 మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సభ్యులకు ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్ళలో డీసీఆర్‌బీ లెక్కల ప్రకారం 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments