Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ సెక్రటేరియట్లపైన కలెక్టర్లు దృష్టిపెట్టాలి: సీఎం జగన్

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:22 IST)
వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాలపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రింటర్, స్కానర్, నెట్, అన్నీ ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు. గ్రామ సెక్రటేరియట్‌ పక్కనే నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. 
 
కల్తీలేని వాటిని రైతులకు అందుబాటులో ఉంచగలిగితే రైతులకు మంచి చేసినట్టేనని, గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ పోస్టుల కోసం 22 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారనే నమ్మకంతో తానున్నట్టు తెలిపారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం ఎప్పుడూ జరగలేదన్నారు. ఇన్ని లక్షల మంది రాయడం కూడా ఎప్పుడూ జరగలేదని తెలిపారు. 
 
ఒక చరిత్రను మనం సృష్టిస్తున్నాం, నా కలెక్టర్లు, నా ఎస్సీలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నేను గర్వంతో చెప్తున్నాను, ఎక్కడా విమర్శలు రాకుండా, పూర్తి పారదర్శక విధానంలో పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. అలాగే, క్రీడలు గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సీఎం దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. 
2014 రాష్ట్ర విభజన తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ఇవ్వండి. 
బంగారు పతకం వచ్చిన వారికి రూ.5లక్షలు వెండి వచ్చిన వారికి రూ.4లక్షలు, కాంస్యం వచ్చిన వారికి రూ.3 లక్షలు ఇవ్వండి. 
 
జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి. ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25లక్షలు, వెండిపతకం వచ్చిన వారికి రూ.75 వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు. 
వీరికి ప్రోత్సాహం ఇస్తేనే వీళ్లంతా సింధులుగా మారుతారు. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఈ కార్యక్రమం చేద్దామని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments