Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (16:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి లండన్‍‌, యూరప్ వంటి దేశాల పర్యటన కోసం వెళుతున్నారు. ఈ పర్యటనలోభాగంగా, ఆయన ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. ఈ టూర్‌‌ను ముగించుకుని ఈ నెల 31వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌‍సభ ఎన్నికల కోసం ఆయన దాదాపు రెండు నెలల పాటు బిజీగా గడిపారు. ఈ క్రమంలో ఆయన విశ్రాంతి తీసుకునేందుకు తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్‌కు బయలుదేరి వెళతారు. జగన్ కుమార్తెలు లండన్‍‌లో ఉంటున్న విషయం తెల్సిందే. తొలుత లండన్‌కు చేరుకుని అక్కడ తన కుమార్తెలను వెంటబెట్టుకుని ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. 
 
కాగా, జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసుకోగా దాన్ని విచారించిన కోర్టు ఈ నెల 17 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ పర్యటనలో ఆయన వాడే మొబైల్ నంబర్, ఈమెయిల్ తదితర వివరాలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులకు జగన్ సమ్మతించడంతో విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments