Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ని బిగ్ బాస్ విజేత చేయండి!

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (17:36 IST)
ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నతమైన విద్యనభ్యసించిన షణ్ముఖ్  యూట్యూబ్ స్టార్ గా పేరు పొందాడని ఆయన తండ్రి కె ఎస్ ఎస్ అప్పారావు అన్నారు. యూట్యూబ్ లో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా సూర్య అనే వెబ్ సిరీస్ తో ఆంధ్ర తెలంగాణ యువత మనసులు దోచుకున్న షణ్ముఖ్, మా టీవీ బిగ్ బాస్ లో ఫైనల్స్ జాబితాలో నిలవడం అభినందనీయమన్నారు. 
 
 
విశాఖ‌లో గురువారం ఉదయం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్స్ లో ఐదుగురు ప్రధానంగా పోటీ పడుతున్నారని, అందులో షణ్ముఖ్ కు విజేత అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మొత్తం 19 మంది బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టగా, అందులో టాప్ ఫైవ్ లో షణ్ముఖ నిలవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.అందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా షణ్ముఖ్  విజేతగా నిలవాలంటే అభిమానులు భారీ స్థాయిలో ఓటింగ్ చేయాలని హాట్ స్టార్ ద్వారా మరియు మీ మొబైల్స్ ద్వారా మిస్సేడ్ కాల్ ఇవ్వడం ద్వారా ఓటు వేసి షణ్ముఖి విన్నర్ గా నిలిచేందుకు సహకరించాలని పేరుపేరునా కోరారు.


విశాఖకు చెందిన షణ్ముఖ్ అంచెలంచెలుగా ఎదిగి పలు వెబ్ సిరీస్ ద్వారా యూట్యూబ్ ప్రేక్షకుల మన్ననలు పొందారని,  ఈ బిగ్ బాస్ కాంటెస్ట్ లో షణ్ముఖ్  టాప్ ఫైవ్ నుంచి టాప్ వన్ గా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రార్థించారు. శుక్రవారం సాయంత్రం లోపు తమ అమూల్యమైన ఓటును షణ్ముఖ్ కు  వేసి గెలిపించాలని ఆయన తండ్రి అప్పారావు మీడియా ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కోరారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎం.త్రినాధరావు, నేరేడ్ కో సెక్రటరీ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments