కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (19:42 IST)
కారుకి ముసుగేసి లోపల ఏసీ వేసుకుని మద్యం సేవించారు. అనంతరం మత్తులోకి జారుకున్నారు. కారులో ఆయిల్ అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది. మత్తులోకి పోయిన యువకులు ఊపిరాడక కారులోనే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తిరుపతిలోని తిరుచానూరు ప్రాంతంలో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతిలోని తిరుచానూరులో దిలీప్, వినయ్ అనే ఇద్దరు యువకులు మద్యం సేవించాలనుకున్నారు. ఐతే తాము మద్యం సేవించడాన్ని ఎవ్వరూ చూడకూడదని కారులో ఎక్కారు. ఐనప్పటికీ కారు అద్దల్లోంచి కనిపిస్తుండటంతో ఇద్దరూ కారు దిగి దానికి కవర్ వేసి కప్పేసారు. ఆ తర్వాత తిరిగి కారులోకి వెళ్లిపోయి ఏసీ ఆన్ చేసారు.
 
అనంతరం ఇద్దరూ పూటుగా మద్యం సేవించారు. మత్తులోకి జారుకున్నారు. కానీ అర్థరాత్రి దాటాక కారులో ఆయిల్ అయిపోవడంతో ఇంజిన్ ఆగిపోయింది. దీనితో పాటు ఏసీ కూడా ఆగిపోయి కారులో ఆక్సిజన్ లేకుండా పోయింది. ఫలితంగా వీరిద్దరూ గాలి ఆడక కారులోనే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments