Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (17:10 IST)
''ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంత చెప్పినా నన్ను బలవంతం పెట్టి మరో అమ్మాయితో పెళ్లి చేసారు. నా భార్యగా వచ్చిన ఆమెతో నేను ఇప్పటివరకూ సుఖపడింది లేనేలేదు. అలాగే నేను ఇష్టపడిన అమ్మాయిని విడిచి బ్రతకలేను. అందుకే అమ్మా-నాన్నా నన్ను క్షమించండి. నేను నా ప్రియురాలితో కలిసి చనిపోతున్నా'' అంటూ తెలంగాణలోని బీబీ నగర్ మండలం కొండమడుగులో 39 ఏళ్ల సుధాకర్ తన ప్రియురాలు పాసాల సుష్మితతో కలిసి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని మరణించారు. 
 
ఆత్మహత్యకు ముందు సుధాకర్ ఓ వీడియో విడుదల చేసాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే పెద్దలు అంగీకరించలేదనీ, వారి ఒత్తిడితో మరో అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. ఐతే పెళ్లి జరిగిన దగ్గర్నుంచి తన భార్యతో తనకు సుఖం లేదనీ, పొద్దస్తమానం ఎవరితో ఒకరితో లింకు పెడుతూ తనకు మనశ్శాంతి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇంత ఘోరమైన జీవితం బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదనీ, అందుకే తన ప్రియురాలితో కలిసి చనిపోతున్నట్లు తెలిపాడు.
 
కాగా వీరి వివాహేత సంబంధం కారణంగా గత కొన్నేళ్లుగా ఇరు కుటుంబాల్లోనూ తగాదాలు తలెత్తాయి. దీనితో రాగల రిసార్ట్సులో గది తీసుకున్న వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments