Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గృహనిర్భందం

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (09:52 IST)
నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. జిల్లాలోని పొట్టేపాళెం కలుజు వద్ద వంతెన నిర్మించాలన్న డిమాండ్‌తో ఆయన గురువారం జలదీక్షకు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయన వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వచ్చి ఆయన్ను అడ్డుకుని ఇంట్లోనే గృహ నిర్బంధించారు. పైగా, నిరసన దీక్షకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా ఆయన ఇంటివద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. 
 
కలుజు వద్ద వంతెనను నిర్మించాలని కోరుతూ నెల్లూరులోని మాగుంట లేఔట్‌లోని తన నివాసం నుంచి ఆయన బయటకురాగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై మండిపడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు, మద్దతుదారులు భారీ ఎత్తున తరలి రావడంతో ఉక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments