Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలకిచ్చే ప్రాధాన్యత మాకేదీ?... జగన్ పై వైసీపీ ఎంపీల ఆగ్రహం!

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (07:48 IST)
ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ భేటీలో వైసీపీకి చెందిన ఎంపీలంతా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సీఎం జగన్ ఎమ్మెల్యేకు ఇచ్చినంత ప్రాధాన్యత తమకు ఇవ్వడంలేదని ఎంపీలు కినుక వహించినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు తమ అసహనాన్ని దాచుకోవడంలేదు. పార్టీ గీత దాటితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జగన్ హెచ్చరికలు చేసి మరీ పంపినప్పటికీ వైసీపీ ఎంపీలు ఎవరూ లెక్కచేయలేదు.

తెలుగు మీడియం కోసం రఘురామకృష్ణం రాజు పార్లమెంట్‌లోనే ప్రశ్నలు సంధించారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు విజయసాయి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎంపీలు తమ అసంతృప్తిని పూర్తి స్థాయిలో బయట పెట్టారు. ఈ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మా కొట్టారు.

మిగిలినవారిలో అనేకమంది తమ తమ నియోజక వర్గాల్లో తమకు ఎదురవుతున్న పరిస్థితులను ఏకరవుపెట్టారు.
తమ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సమావేశంలో వైసీపీ ఎంపీల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాల్సి వస్తోందని, ఎమ్మెల్యేలకు ఇచ్చినంత ప్రొటోకాల్‌ తమకు ఇవ్వడం లేదని ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల తీరును జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలు విజయసాయిని కోరారు.

నామినేటెడ్‌ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేశారు. జగన్‌ పాలనపై జాతీయస్థాయిలో వ్యతిరేకత వస్తోందని.. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డికి తెలిపారు. జగన్‌ ప్రభుత్వ విధానాలను జాతీయస్థాయిలో ప్రచారం చేసేందుకు.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విజయసాయిరెడ్డి సూచించారు. 

పార్లమెంట్‌లో జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు మాట్లాడితే.. అడ్డుకోవాలని వైసీపీ ఎంపీలకు విజయసాయి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments