Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు బీజేపీతో ప్రేమ కలాపాలన్న విజయసాయి రెడ్డి: ఫిబ్రవరి 20న పాదయాత్ర

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:33 IST)
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ "విశాఖ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర" చేస్తున్నట్లు ప్రకటించిన శ్రీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. శ్రీ వి. విజయసాయిరెడ్డి మాట్లాడారు.
 
1. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలలో స్టీల్‌ ప్లాంట్, డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇతర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంట్‌లోనూ, పార్లమెంట్‌ బయటా వ్యతిరేకిస్తోంది. స్టీల్‌ ప్లాంట్, డ్రెజ్జింగ్ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు ఆనాడు మా నాయకుడు స్వర్గీయ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎలాగైతే వ్యతిరేకించారో.. ఇప్పుడు కూడా ప్రైవేటీకరణను వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోంది. మా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా స్టీల్‌ ప్లాంట్ విషయంలో ప్రత్యామ్నాయాలను కూడా సూచించటం జరిగింది.
 
2. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలంటే గనులను కేటాయించాలి. అప్పుడే ఒక్కో టన్నుపైన రూ.6-7వేలు ఆదా చేసినట్లు అవుతుంది. విశాఖ ఉక్కు విస్తరణలో 3 మిలియన్‌ టన్నుల నుంచి 7. 3 టన్నుల సామర్థ్యానికి పెంచటంతో విపరీతమైన రుణభారం సంస్థపైన పెరిగింది. ఆ రుణంపై ఇంచుమించు 14% వడ్డీని సంస్థ కడుతోంది. దీనివల్ల స్టీల్‌ ప్లాంట్‌కు ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. అందువల్ల రుణాలను ఈక్విటీ కింద మార్చాలి.  స్టీల్‌ ప్లాంట్‌ ప్రొడక్షన్‌ను స్థిరీకరణ చేస్తే ఆరు నెలల్లో సంస్థ లాభాల్లోకి వస్తుందని వైయస్‌ఆర్‌సీపీ బలంగా నమ్ముతోంది. సీఎం శ్రీ వైయస్‌ జగన్ గారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దానికి మేం 13 కార్మిక సంఘాలు అన్నింటితో కలిపి  అఖిలపక్ష సమావేశానికి హాజరు అయ్యాం. 13 కార్మిక సంఘాలతో చర్చలు జరిపి.. వారికి వైయస్ఆర్‌సీపీ తరుపున సంఘీభావం తెలిపాం. కార్మికులకు సంఘీభావంలో భాగంగానే స్టీల్‌ ప్లాంట్ ఎదుట మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ధర్నాలో పాల్గొనటం జరిగింది. భవిష్యత్‌లోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.
 
3. అఖిలపక్ష సమావేశంలో కొన్ని డిమాండ్లను కార్మిక సంఘాలు వారు పెట్టడం జరిగింది.
 
1. సీఎం గారిని కలవాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. వారు త్వరలో సీఎం గారిని కలుస్తారు.
 
2. అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. వారి కోరిక మేరకు సీఎం శ్రీ జగన్ గారు స్పందించటం జరుగుతుంది. కార్మిక సంఘాల ఇతర డిమాండ్లు సీఎం శ్రీ జగన్ గారి ముందు పెడతారు.
 
3. త్వరలో సీఎం గారితో కార్మిక సంఘాల నాయకుల సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుంది.
 
4. ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ను కార్మిక సంఘాలు కోరాయి. కార్మిక సంఘాల నాయకులకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో తెలియదు. అయితే, కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీలు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ ఇతర పార్టీల ఎంపీలతో ప్రధాని అపాయింట్‌మెంట్ కోరటం జరుగుతుంది. తప్పకుండా ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారని మేం భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కార్మిక సంఘాల నాయకులు కలుస్తారు. ప్రధానిని అపాయింట్‌మెంట్ అడుగుదాం.
 
5. ఇవికాకుండా భిన్నంగా ఏదో దీక్ష చేయటం అన్నటువంటిది కాదు. దీక్ష చేసి పోలీసులను బ్రతిమిలాడి నన్ను ఆసుపత్రికి తరలించండి అని అడగటం కన్నా చిత్తశుద్ధితో ఏం చేస్తే స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలు అన్నింటినీ చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ నెల 20వ తారీఖు ఉదయం గం.8.30 నిమిషాల నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్నటువంటి గాంధీ విగ్రహం నుంచి విశాఖపట్నంలోని అన్ని నియోజకవర్గాలు కవర్‌ చేసుకుంటూ సౌత్ నుంచి నార్త్‌, ఈస్ట్‌, గాజువాక నియోజకవర్గాల మీదుగా స్టీల్‌ ప్లాంట్ ప్రయోజనాల్ని కాపాడేలా విశాఖ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తున్నాం. 23 నుంచి 25 కి.మీ నడుచుకుంటూ వెళ్లి విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎదుట సమావేశమై వైయస్‌ఆర్‌సీపీ నిరసన చేస్తుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఈ నిరసన కార్యక్రమం ఢిల్లీకి వినపడేలా తెలియజేయటం జరుగుతుంది.
 
6. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయాలో వాటిని అన్నింటినీ చేయటానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. ఇందులో ఎటువంటి రాజీ ప్రసక్తే లేదని స్పష్టంగా చెబుతున్నాం. చంద్రబాబులాగా డ్రామాలు ఆడే అలవాటు మాకు లేదు. మా నాయకుడు శ్రీ జగన్ ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు. చెప్పింది చేస్తారు. చంద్రబాబు డ్రామాలు నమ్మవద్దు. మేం చేసి చూపిస్తామని శ్రీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
 
7. గత అఖిలపక్ష సమావేశానికి అందరినీ పిలిచాం. స్వయంగా స్థానిక మంత్రిగారే పిలిచారు. టీఎన్‌టీయుసీ అఖిలపక్షం సమావేశానికి రాలేదు. వారి నుంచి ఎటువంటి స్పందన లేనప్పుడు మనం చేయగలిగిందీ ఏమీ లేదు.
 
8. చంద్రబాబు బీజేపీతో ప్రేమ కలాపాలు జరిపించటానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. రహస్యంగా ప్రేమ కలాపాలు ఏదో చేస్తున్నారు. ఆప్రశ్న ఏదో చంద్రబాబునే మీడియా అడగాలి. ప్రధానిమంత్రి గారికి చంద్రబాబు లేఖ రాయరు. ముఖ్యమంత్రికి రాశారు. ఎలక్షన్‌ కమిషన్‌కు రాస్తారు. అధికారం లేనివారికి చంద్రబాబు లేఖలు రాస్తారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మంత్రి గారు. ఆయనకు తప్ప అందరికీ లేఖలు చంద్రబాబు రాస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏముందని చంద్రబాబును మీడియానే ప్రశ్నించాలి. ఎవరికైతే అధికారం ఉందో వారికి ఎందుకు లేఖ రాయరో చంద్రబాబు నాయుడును జర్నలిస్టులే అడగాలి.
 
9. మేజర్ మినరల్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. మైనర్‌ మినరల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కోల్, ఐరన్‌ ఓర్ వంటివి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి.
 
10. పాదయాత్ర అనేది రాజకీయాలకు సంబంధం లేదు. స్టీల్ ప్లాంట్ హక్కులు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట యాత్ర చేయటం జరుగుతోంది. దీనికి రాజకీయాలకు ముడిపెట్టవద్దు.
 
11. ప్లాంట్‌లో ఉన్నతాధికారులు అంతా ఒరిస్సా వారే కావటం, వారి పెత్తనం వల్ల కూడా సంస్థకు అన్యాయం జరుగుతోందని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments