టీటీడీ ఆస్తుల విక్రయం సరికాదు: వైసీపీ ఎంపీ

సోమవారం, 25 మే 2020 (19:21 IST)
నిరర్ధక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయం పట్ల అధికార వైసీపీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీటీడీ నిర్ణయాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు.

ఇది ముమ్మాటికీ భూముల విరాళం ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని టీటీడీ భావించడాన్ని ఎంపీ తప్పుబట్టారు.

ఆస్తుల అమ్మకం భగవంతుడికి టీటీడీ చేస్తున్న ద్రోహం అని ఎంపీ తప్పుబట్టారు. టీటీడీ భూములపై పాలకమండలి నిర్ణయం ఏమాత్రం సరికాదన్నారు. భక్తితో ఇచ్చిన భూములు విక్రయించే నిర్ణయం సరికాదన్నారు.

దాతలు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు పాలకమండలి పనిచేయాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఆస్తుల విక్రయం విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే టీటీడీ వెనక్కి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ కిరాతకులను పట్టిస్తే రూ.50 వేల నజరానా!