Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులు వేలం వేయనున్న కెనరా బ్యాంకు.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (10:19 IST)
YCP MLA Sridhar Reddy
రుణాల ఎగవేత వ్యవహారంలో శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గ శాసన సభ్యుడు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను కెనరా బ్యాంకు వేలం వేయనుంది. 
 
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మెసర్స్‌ సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. వాటిని సకాలంలో చెల్లించలేదు.
 
అయితే ఆ కంపెనీకి శాసన సభ్యుడు శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీతో పాటు హామీదారైన శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేస్తున్నట్టు ఆ బ్యాంకు ప్రకటించింది. 
 
కాగా ఆ కంపెనీ తీసుకున్న లోన్ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.908 కోట్లు అయ్యాయి. వాటిని చెల్లించకపోవడంతో ఆ కంపెనీ, అలాగే హామీదారు ఆస్తులను వేలం వేయాల్సి వస్తోందని కెనరా బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments