Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో పొత్తంటూ... జగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది : రోజా

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోమారు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైకాపా పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ నేతలు దుష్ప్రచ

Webdunia
ఆదివారం, 15 జులై 2018 (17:24 IST)
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోమారు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైకాపా పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తివాస్తవ విరుద్ధమన్నారు. తమ పాలన సరిగ్గా లేదు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 
 
తెలుగుదేశం పార్టీయే బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చిందని, అసలు ఆ పార్టీ పొత్తు లేకుండా ఎన్నడూ అధికారంలోకి రాలేదని విమర్శించారు. గతాన్ని ఆ పార్టీ మరచిపోయి లేనిపోని విమర్శలు గుప్పిస్తోందన్నారు. 
 
తమ పార్టీ అధినేత జగన్ కు ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారని అన్నారు. జగన్‌పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments