Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి కొత్తకాదు.. మేం సత్యవంతులం కాదు : వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (08:40 IST)
గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగిందని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. పైగా, తాము సత్యవంతులం కాదని, అవినీతి కొత్త కాదని ఆయన అన్నారు. 
 
నెల్లూరు జిల్లా కావలిలోని వైకాపా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు కొత్తకాదన్నారు. గతంలో టీడీపీ హయాంలోనూ, ఇప్పటి కంటే ఎక్కువే ఆరోపణలు వచ్చాయన్నారు. అవినీతి కొత్తకాదన్నారు. తామేమీ సత్యవంతులం కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ముఖ్యంగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం తమ పార్టీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న టీడీపీ మాజీ నేత బీద రవిచంద్ర రూ.400 కోట్ల మేరకు దోపిడీకి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాలేపాటి సుబ్బారాయుడు కూడా తన వంతు సహకారం అందించారని చెప్పారు. వీరిద్దరూ కలిసి గ్రామ స్థాయిల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. 
 
ఇపుడు కావలి మున్సిపాలిటీ అధికారులపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇకపై అలాంటి వాటికి తావులేకుండా చూస్తానని హామీ ఇ్చచారు. ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు పురపాలక అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకరావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి పట్టణ వాసులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments